Sunil & Trivikram Combination New Movie

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ఫైనల్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. మొత్తానికి చిత్ర యూనిట్ మరి కొన్ని నెలల్లో రెగ్యులర్ షూటింగ్ తో బిజీ కానుంది. అయితే పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ మూవీకి క్లాప్ బోర్డు కొట్టడంతో సినిమా స్టార్ట్ అవ్వకముందే భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది . అంతే కాకూండా ఇప్పటికి కి కూడా ఆ మ్యాటర్ చర్చనీయంశంగా మారింది.

ఎక్కడ చూసినా పవన్ – ఎన్టీఆర్ అభిమానులు బలే కలుసుకున్నార్రా ? అంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ కథలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం నారా రోహిత్ ని అనుకున్నట్లు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడు దానికి విరుద్ధంగా మరొక న్యూస్ హల్చల్ చేస్తోంది. నారా రోహిత్ కి దక్కాల్సిన అవకాశాన్ని సునీల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా సునీల్ కమెడియన్ పాత్రలను చేయడానికి రెడీగా ఉన్నట్లు చెబుతున్నాడు.

దీంతో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కి సునీల్ ని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సునీల్ – త్రివిక్రమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. వీరి కలయికలో సినిమా ఉంటుందని టాలీవుడ్ లో చాలాసార్లు వార్తలు వచ్చాయి. అసలైతే సునీల్ – పవన్ 25వ చిత్రంలో కనిపిస్తున్నాడని అందరు అనుకున్నారు. కానీ అది నిజం కాదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో తప్పకుండా ఉంటాడని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే త్రివిక్రమ్ గారే చెప్పాలి.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: