సుదీర్ బాబు నిర్మాతగా మారాడు – మహేష్ బాబు

సుదీర్ బాబు నిర్మాతగా మారాడు – మహేష్ బాబు

హీరో సుధీర్ బాబు కూడా తన బావమరిది మహేష్ బాబు బాటలోనే ఇకపై నిర్మాతగా మరబోతున్నాడు. శ్రీమంతుడు సినిమాతో రెండేళ్ల క్రితం మహేష్ బాబు నిర్మాతగా మారగా తాజాగా తన అప్‌కమింగ్ చిత్రంతో నిర్మాతగా మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు సుధీర్ బాబు. శివ మనసులో శృతి అనే సినిమాతో ఐదేళ్ల క్రితం నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ బాబు తన తర్వాతి చిత్రంతో తాను నిర్మాతగా మరడమేకాకుండా మరో కొత్త వ్యక్తిని దర్శకుడిగా పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు. అవును, ఇదే సినిమాతో రాజశేఖర్ నాయుడు అనే ఓ కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. కన్నడ నటి నభా నతేష్ సుధీర్ బాబు సరసన జంటగా నటించేందుకు సైన్ చేసింది.

వాస్తవానికి ఈ సినిమాను వేరే వాళ్లు నిర్మించాల్సి వున్నప్పటికీ.. చివరి నిమిషంలో సదరు నిర్మాత వెనకడుగు వేయడంతో తానే బాధ్యత తీసుకుని సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చాడట సుధీర్ బాబు. ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రముఖ బ్యాండ్మిటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలోనూ సుధీర్ బాబు గోపీచంద్ పాత్ర పోషించనున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్నాడు.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: