Facebookలో తిరుగులేని కొత్త ఫీచర్ వచ్చింది!

Facebookలో తరచూ కొత్త ఆప్షన్లు రావడం మనకు తెలిసిందే. అయితే కొన్ని ఫీచర్లు మాత్రం చాలా ఉపయుక్తంగా ఉంటాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన సదుపాయం అలాంటిదే.

మన friend listలో ఓ వ్యక్తి ఉన్నారనుకుందాం.  స్వతహాగా అతను చాలా మంచి వ్యక్తి అనుకుంటే.. ఈ మధ్య మనకు నచ్చని రాజకీయాలు, వివాదాల గురించి పోస్టులు పెడుతూ విసిగిస్తుంటే ఇప్పటి వరకూ మహా అయితే ఏం చేయగలిగే వాళ్లం? Unfollow గానీ లేదా Unfriend గానీ మాత్రమే చేసే వాళ్లం. దీనివల్ల వాళ్ల పోస్టులు శాశ్వతంగా మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది కదా!
సరిగ్గా ఈ సమస్యకి Facebook ఓ మంచి పరిష్కారాన్ని తీసుకు వచ్చింది. ఎవరి పోస్టులైనా మనకు తాత్కాలికంగా నచ్చకపోతే వారిని 30 రోజుల పాటు Snooze చేసే అవకాశం లభించింది. అంటే ఆ 30 రోజులు వారి పోస్టులు Facebook Newsfeedలో మీ దృష్టికి రావన్నమాట. 30 రోజుల సమయం ముగిశాక గడవు ముగిసిపోయిన విషయం Facebook మీ దృష్టికి తీసుకు వస్తుంది. వారి పోస్టులు తిరిగి పొందాలంటే resume చేసుకోవచ్చు, లేదా మరో 30 రోజుల పాటు snooze చేసుకోవచ్చు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: