Actress Vani Viswanath Warned Ram Gopal Varma 

Actress Vani Viswanath Warned Ram Gopal Varma

అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై నిన్నటి తరం హీరోయిన్, టిడిపిలో చేరుతానని చెప్పిన వాణీవిశ్వనాథ్ స్పందించారు.

బాబు పావులు: రోజాకు చెక్ చెప్పేందుకు రంగంలోకి వాణీ విశ్వనాథ్ వర్మ సినిమాపై ఇప్పటికే టిడిపి నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారా లోకేష్, వంగలపూడి అనిత తదితరులు స్పందించారు. ఇప్పుడు వాణీ విశ్వనాథ్ దర్శకుడిపై మండిపడ్డారు.

వెంటనే ఆపెయ్

సినిమాను తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే రామ్ గోపాల్ వర్మ ఆపేయాలని వాణీవిశ్వనాథ్ హెచ్చరించారు. ప్రజలు దేవుడిగా చూసే ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సినిమాను తీస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె అన్నారు.

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిక.

మొండిగా సినిమాను తీస్తానని ముందుకు వెళ్తే తాము ఊరుకునేది లేదని వాణీ విశ్వనాథ్ చెప్పారు. అవసరమైతే వర్మ ఇంటిముందు ధర్నా చేస్తామని చెప్పారు. ప్రజలు ఎన్టీఆర్‌లో రాముడిని, కృష్ణుడిని చూసుకుంటున్నారని చెప్పారు.

బాలకృష్ణ చెబుతున్న సమయంలో..

ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను బాలకృష్ణ తీయబోతున్న తరుణంలోనే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాను తీయడం సరైంది కాదని వాణీ విశ్వనాథ్ అన్నారు. సినిమాకు వర్మ పెట్టిన పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉన్నాయని మండిపడ్డారు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: