నా కెరీర్ నాకు ఇష్టం – శృతి హసన్

కాటమరాయుడు తర్వాత మళ్లీ తెలుగుతెరపై కనిపించలేదు. మధ్యలో కొన్ని ఆఫర్లు వచ్చినా వదులుకుంది. అటు కోలీవుడ్ లో కూడా సంఘమిత్ర లాంటి భారీ బడ్జెట్ సినిమా నుంచి తప్పుకుంది. ఇలా సౌత్ కు దాదాపు దూరమైంది శృతిహాసన్. అయితే ఇదంతా తను కావాలనే చేస్తున్నానని ప్రకటించింది కమల్ కూతురు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ లో తను ఏది కోరుకుంటున్నానో అది మిస్ అవుతున్నానని అంటోంది శృతిహాసన్. అందుకే కెరీర్ ను విశ్లేషించుకోవాలనే ఉద్దేశంతో కావాలనే గ్యాప్ తీసుకున్నానని చెబుతోంది. ఎలాంటి పాత్రలు చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానో, అలాంటి పాత్రలకు దూరమైపోతున్నానని.. అలాంటప్పుడు గ్యాప్ తీసుకోవడమే ఉత్తమమని అంటోంది.

ప్రస్తుతం చేతిలో శభాష్ నాయుడు సినిమా మాత్రమే ఉంది. తండ్రి కమల్ తో కలిసి అందులో నటిస్తోంది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కొత్త సినిమాల గురించి ఆలోచిస్తానంటోంది శృతిహాసన్.

ఈమధ్య ఎక్కువగా లండన్ లోనే ఉంటోంది శృతిహాసన్. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ముంబయి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ ఈవెంట్ ముగిసిన వెంటనే తిరిగి లండన్ వెళ్లిపోయింది. ఇటలీకి చెందిన మైఖేల్ కోర్సల్… లండన్ లో నటుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడితో శృతి చాలా క్లోజ్ గా ఉంటోందని పుకార్లు వినిపిస్తున్నాయి.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: